Most Recent

ఏం అందంరా బాబు..! చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయిపొయింది..

ఏం అందంరా బాబు..! చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయిపొయింది..

ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్త కొత్త హీరోయిన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ దూసుకుపోతున్నారు. ఇక చాలా మంది హీరోయిన్స్ కు అవకాశాలు చాలా చిత్ర విచిత్రంగా వస్తుంటాయి. కొంతమంది ఎంతో కష్టపడి అవకాశాలను అందుకుంటున్నారు. మరికొంతమందికి ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ అలా వచ్చిన వారే.. అయితే ఇప్పుడు మనం చూస్తున్న హీరోయిన్ కూడా విచిత్రంగా హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ కు వెళ్తే అనుకోకుండా హీరోయిన్ గా మారిపోయింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తెలుగులో రాణిస్తున్నారు వారిలో శివాని నాగరం ఒకరు. ఈ అమ్మడు చేసింది ఒకే ఒక్క సినిమా. శివాని నాగరం నటనా జీవితాన్ని ఆడిషన్‌ల ద్వారా ప్రారంభించింది. ఈ అమ్మడి మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు (2024), ఈ చిత్రంలో సుహాస్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె లక్ష్మి అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపారు, నేను హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ అని వెళ్లాను. అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్ గానే తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే మొదటి రోజు షూటింగ్ జరిగే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయా.. అని తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ కార్యక్రమంలో అదరగొట్టింది. ఓ రేంజ్ లో అందాలతో అదరగొట్టింది.. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.