
ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా.. ఇండియాలోనే తొలిసారిగా సీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందు పోస్టర్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
కింగ్ స్టన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే స్ట్రీమింగ్ డేట్ పై జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ తోపాటు హీరోయిన్ దివ్యభారతి చేతన్, అళగమ్ పెరుమాళ్, సాబుమోన్ అబ్దుసమాద్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించడం విశేషం. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈసినిమా కేవలం రూ.5.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను ప్యార్లల్ యూనివర్సల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై జీవీ ప్రకాశ్ కుమార్, భవానీ శ్రీ, ఉమేశ్ కేఆర్ భన్సల్ నిర్మించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..