
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్లు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ విషయాలను అందులో పంచుకుంటుంది. అలాగే తన లేటెస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఇక తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అభిమానుల నుంచి సినిమా తారలకు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకుంది. బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షోకు గెస్టుగా హాజరైందీ తెలుగమ్మాయి. ఈ సందర్భంగా ‘మీ జీవితంలో ఎదురైన బెస్ట్, నాటీ కంప్లిమేంట్’ ఏంటి అని అరియానా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా అనన్య తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.
ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది..
‘ కెరీర్ ప్రారంభంలో ఇంకా అప్పటికీ పెద్దగా గ్లామర్ పాత్రలో నటించని సమయంలో ఓ షాప్ ఓపెనింగ్ వెళ్లాను. ఆ సమయంలో ఓ అభిమాని ఎంతో ఆతృతగా నా వద్దకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన వెంటన ‘మేడమ్ మీ నడుము చాలా బాగుంది’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ కామెంట్ వల్ల నాకు కోపం రాలేదు. పైగా ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది’ అని అనన్య నాగళ్ల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అనన్య నాగళ్ల..
View this post on Instagram
కాగా ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా శ్రీ శైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంది అనన్య నాగళ్ల. అక్కడ శివునికి ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇటీవల అనన్య నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటోంది.. ఇందులో అనన్య పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతకు ముందు పొట్టేల్ సినిమాలోనూ ఈ బ్యూటీ రోల్ కు మంచి మార్కులే పడ్డాయి.
అనన్య నాగళ్ల మిర్రర్ సెల్ఫీ వీడియో..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .