Most Recent

Oscars 2025: ఆస్కార్ 2025 విన్నర్స్ వీరే.. స్టేజ్ పై హిందీలో మాట్లాడిన హోస్ట్ ఓ’బ్రెయిన్..

Oscars 2025: ఆస్కార్ 2025 విన్నర్స్ వీరే.. స్టేజ్ పై హిందీలో మాట్లాడిన హోస్ట్ ఓ’బ్రెయిన్..

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 97వ అకాడమీ అవార్డుల వేడుకల కోసం హాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త ట్రెండీ దుస్తులలో కనిపించి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‏లో అట్టహాసంగా జరిగింది. ఎమిలియా పెరెజ్ 13 మంది ఆస్కార్ నామినీలతో అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రం నామినీలలో “అనోరా”, “ది బ్రూటలిస్ట్”, “ఎ కంప్లీట్ అన్ నోన్”, “కాన్క్లేవ్”, “డ్యూన్: పార్ట్ టూ”, “ఎమిలియా పెరెజ్”, “ఐ యామ్ స్టిల్ హియర్”, “నికెల్ బాయ్స్”, “ది సబ్‌స్టాన్స్”, “వికెడ్” పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుకల ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రాంతాలలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మన దేశంలో జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.

ఈ షోను మొదటిసారిగా లేట్ నైట్ హోస్ట్ కోనన్ ఓ’బ్రెయిన్ హోస్ట్ చేస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఎమిలియా పెరెజ్ పాట ఎల్ మాల్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటను జోయ్ సల్దానా, కార్లా సోఫియా గాస్కాన్ ఈ చిత్రంలో ప్రదర్శించారు. ఉత్తమ ఎడిటింగ్ ఆస్కార్ అవార్డు అనోరాకు దక్కింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 2 అవార్డులు వచ్చాయి. కాన్‌క్లేవ్ చిత్రానికి గాను పీటర్ స్ట్రాఘన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్నారు. అనోరా చిత్రానికి సీన్ బేకర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును గెలుచుకున్నాడు. ఇది అతని మొదటి ఆస్కార్ అవార్డు.

ప్రపంచవ్యాప్తంగా ఈ షో చూస్తున్న ప్రజలను చేరుకోవడానికి హోస్ట్ కోనన్ వేదికపై స్పానిష్, హిందీ, మాండరిన్ భాషలలో మాట్లాడారు. ఎ రియల్ పెయిన్ చిత్రానికి గాను కీరన్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతని మొదటి అవార్డ్. ఈ వేడుకలో ఆడమ్ శాండ్లర్ హూడీ, బాస్కెట్‌బాల్ షార్ట్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆస్కార్ విన్నర్స్..

ఉత్తమ సహాయ నటుడు – కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ – నో అదర్ ల్యాండ్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ‘ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా’
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ఎమిలియా పెరెజ్ పాట ఎల్ మాల్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
ఉత్తమ సహాయ నటి – జోయ్ సల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఎడిటింగ్ – అనోరా
ఉత్తమ మేకప్ – సబ్‌స్టాన్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – పీటర్ స్ట్రాఘన్ (కాన్‌క్లేవ్ )
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా )
ఉత్తమ కాస్ట్యూమ్ – వికెడ్‌
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్‌
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – లాట్వియన్ చిత్రం ఫ్లో

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.