Most Recent

Anchor Suma: అరుదైన కృష్ణ శిలలతో శివాలయం కట్టించిన నిర్మాత.. యాంకర్ సుమ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్

Anchor Suma: అరుదైన కృష్ణ శిలలతో శివాలయం కట్టించిన నిర్మాత.. యాంకర్ సుమ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్

మహా శివరాత్రి పండగను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఘనంగా జరుపుకొన్నారు. సమీపంలోని శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల మాత్రం బళ్లారిలోని ఓ శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా ఈ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించింది మరెవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి. గత సంవత్సరం అరుదైన కృష్ణ శిలలతో కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా బళ్లారిలో ఈ శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని నిర్మించారు. పవిత్ర మాఘమాసంలో ఈ శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని ప్రారంభించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, యశ్, మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.. ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాంకర్ సుమ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. శివలింగానికి అభిషేకం చేసింది. సుమ వెంట పురాణపండ శ్రీనివాస్, నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఉన్నారు.

‘మహాశివరాత్రి పర్వదినాన అమృతేశ్వర గర్భగుడిలో వేద మంత్రాల మధ్య నేను స్వయంగా మహాస్పటికలింగానికి అభిషేకం చేశాను. ఇది నాకు ఎంతో తన్మయత్వానికి గురిచేసింది’ అని సుమ చెప్పుకొచ్చింది. కాగా శివరాత్రి సందర్భంగా సామాన్యులతో పాు ఎంతో మంది సిని, రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు.

ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటితో స్టార్ యాంకర్ సుమ కనకాల

Anchor Suma 1

Anchor Suma 1

ఇక సుమ విషయానికి వస్తే.. సినిమా ఈవెంట్లు, టీవీ షోలతో బిజి బిజీగా ఉంటోందీ స్టార్ యాంకర్. ఇటీవలే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సెలెబ్రేటిలతో వంటలు చేయించే ప్రోగ్రాం చేస్తుంది. ఈ షోకు ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.

ఆహాలో సుమ వంటల ప్రోగ్రాం ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.