Most Recent

Tollywood: హాలీవుడ్‏లో సత్తా చాటుతున్న హీరోయిన్.. ఆమె అందానికి ప్రపంచమే ఫిదా.. ఎవరంటే..

Tollywood: హాలీవుడ్‏లో సత్తా చాటుతున్న హీరోయిన్.. ఆమె అందానికి ప్రపంచమే ఫిదా.. ఎవరంటే..

ప్రస్తుతం ఆమె హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అటు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తన చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ బాల్యాన్ని గుర్తుచేసుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చిన్నవయసులోనే మిస్ ఇండియా కిరీటాన్ని వరించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ గా మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా..? తనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా బాల్యం ఫోటోలను పంచుకుంది. 1983 నుంతి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్ గా కనిపించింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

ఇలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ప్రియాంక చిన్నప్పుడు అచ్చం తన కూతురు మాల్టీలా కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక తెలుగులో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB29 ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.