Most Recent

Nabha Natesh: ఇప్పుడు ఆ పనిని తెగ ఎంజాయ్ చేస్తున్నానంటున్న నభా నటేష్

Nabha Natesh: ఇప్పుడు ఆ పనిని తెగ ఎంజాయ్ చేస్తున్నానంటున్న నభా నటేష్

హీరోయిన్ గా బిజీ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది ఆ అందాల భామ నభా నటేష్.. నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా  ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది నభా. ఆతర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించింది. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నభా  నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

కానీ నభా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి కోలుకొని సినిమాలు చేయాలని చూస్తుంది. మొన్నామధ్య చేసిన డార్లింగ్ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం నిఖిల్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా తప్పా న నభా చేతిలో కొత్త సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో తన వయ్యారాలతో దర్శకనిర్మాతలకు గాలులు వేస్తుంది ఈ చిన్నది. తాజాగా నభా తన యాక్సిడెంట్ గురించి తన ఫిట్ నెస్ గురించి మాట్లాడింది. యాక్సిడెంట్ త‌ర్వాత వ‌ర్క‌వుట్స్ చేయ‌డాన్ని ఎంతో  ఎంజాయ్ చేస్తున్నాన‌ని తెలిపింది ఈ బ్యూటీ. శ‌రీరంపై మరింత అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్స‌ర్సైజ్‌లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ఎక్కువగా చేస్తున్నా.. యాక్సిడెంట్ కు ముందు హీరోయిన్నీ కాబట్టి ఎదో చేస్తున్నా అంటే చేస్తున్నా అన్నట్టు వ‌ర్క‌వుట్స్ చేసేదాన్ని.. కానీ ఇప్పుడు నా ఆలోచన  మొత్తం  మారిపోయింది అని చెప్పుకొచ్చింది నభా నటేష్.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.