
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. భాకారాపేట సమీపంలో ఒక రిసార్ట్ లో బస చేసిన మంచు మనోజ్ వద్దకు వెళ్ళారు ఎస్ఐ రాఘవేంద్ర. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న రిసార్ట్ లో మనోజ్ వద్దకు వెళ్లి ఇక్కడెందుకు ఉన్నారని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే పోలీసులకు, మంచు మనోజ్ మధ్య వాగ్వివాదం జరిగింది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారంటూ ఆరోపించారు మనోజ్. తనే పోలీస్ స్టేషన్ కు వస్తానని వెళ్లి స్టేషన్ ముందు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు మంచు మనోజ్. రాత్రి పట్రోలింగ్ లో భాగంగానే రిసార్ట్ దగ్గరకు వెళ్ళామంటున్నారు పోలీసులు. మంచు మనోజ్ ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళామని మనోజ్ ను ఏమీ అడగలేదంటున్నారు పోలీసులు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన