Most Recent

Pooja Hegde: ఊహించని నిర్ణయం తీసుకున్న పూజా హెగ్డే.. తొలిసారి అలా

Pooja Hegde: ఊహించని నిర్ణయం తీసుకున్న పూజా హెగ్డే.. తొలిసారి అలా

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తుంది . వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. దాంతో ఈ అమ్మడి కెరీర్ డౌన్ అయ్యింది. 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన పూజా ఫొటోలు చూసి దర్శకుడు మిష్కిన్ ఆమెకు సినిమా ఆ ఆఫర్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘ముఖమూడి’ సినిమాతో పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది. 2014 తెలుగు సినిమా ‘ఒక లైలా కోసం’లో అక్కినేనితో నాగ చైతన్య తో జతకట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజ దారో’ అనే హిందీ చిత్రంలో నటించింది. మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అయితే ఈమధ్య ఈ అమ్మడికి హిట్ దక్కడం లేదు. రణవీర్ సింగ్ సరసన సర్కస్, ప్రభాస్ సరసన రాధే శ్యామ్,  సల్మాన్ ఖాన్ సరసన కిజీ కా భాయ్ కిజీ కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అదే సమయంలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలనుంచి తప్పుకుంది.

రీసెంట్ గా షాయిద్ కపూర్ హీరోగా దేవా సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పుడు దీంతో సూర్య 44వ సినిమా రెట్రోలో పూజా హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు  ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్ లల్లో నటించారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తుందని టాక్. ఈ వెబ్ సిరీస్‌ను “డిమాంటి కాలనీ”, “కోబ్రా” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.