-
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు. ఈయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చెర్రీ మాట్లాడుతూ.. తాతయ్యకు సినిమాల్లో నటించాలని చాలా ఉండేదని నాన్నమ్మ చెప్పింది.
-
కానీ ఆయనకు అది సాధ్యం కాకపోవడంతో, చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తుండేవారంట. కానీ డాడీని మాత్రం చాలా ప్రోత్సహించాడంట. ఇక తాతయ్య చివరగా నా సినిమానే చూశారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే నేను చేసిన మొదటి మూవీ చిరుత విడుదలైంది.
-
ఈ సినిమాను తాతయ్య థియేటర్లో చూసి చాలా సంతోషపడ్డారు. నాకు ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత తాతయ్య వీల్ చైర్‌కే పరిమితం కావడంతో ఆయన సినిమాలు చూడలేదు.తర్వాత కన్నుమూశారు.
-
ఇక నాన్నమ్మ నా అన్ని సినిమాలు చూస్తుంది. ముఖ్యంగా నేను, డాడీ కలిసి నటించిన ఆచార్య సినిమాను నాన్నమ్మ చూసి చాలా సంతోషించింది.
-
ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడటం నాన్నమ్మకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అయితే చరణ్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.