Most Recent

ధనుష్ వల్ల నా కల నెరవేరింది.. ఇది అస్సలు ఊహించలేదు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ధనుష్ వల్ల నా కల నెరవేరింది.. ఇది అస్సలు ఊహించలేదు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్  బిజీగా ఉన్నాడు. హీరోగానే కాదు దర్శకుడిగానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా రాయన్ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు ధనుష్. ఇక రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలే  విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక హీరోగానూ వరుస సినిమాలను లైనప్ చేశాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ధనుష్. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ ధనుష్ పై ప్రశంసలు కురిపించింది. ధనుష్ వల్ల తన కోరిక నెరవేరింది అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరు.? ఎందుకు ధనుష్ కు కృతజ్ఞతలు తెలిపిందంటే..

ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

ధనుష్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా..? ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించింది. అనిఖా సురేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. అజిత్  నటించిన సినిమాల్లో బ్యాక్ టు  బ్యాక్ ఆయన కూతురిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో  అక్ తిట్టుకుంది అనిఖా సురేంద్రన్.

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!

ఇక ఇప్పుడు జాబిలమ్మ నీకు అంతకోపమా సినిమాతో మంచి హిట్ అందుకుంది. తాజాగా  అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ ధనుష్ పై ప్రశంసలు కురిపించింది. సోషల్ మీడియా వేదిక ఈ చిన్నది ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా ముగిసింది. ధనుష్ సార్‌కి ఎప్పటికీ కృతజ్ఞతలు.  మీరు నా కలలను నిజం చేశారు. ధనుష్ సార్ కు నేను పెద్ద అభిమానిని. నేను ఒక్క సినిమా ఛాన్స్ కావాలి అని అడిగాను. దాంతో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ధనుష్ దర్శకత్వంలో నటించడం అనేది నేను కలలో కూడా ఊహించని విషయం. ధనుష్ సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అనిఖా సురేంద్రన్. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

 

View this post on Instagram

 

A post shared by Anikha surendran (@anikhasurendran)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.