
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోతే రాణించం కష్టమే.. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గానూ మారారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ గా మారింది. అంతే కాదు తనకన్నా 15ఏళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? ఆమె కేవలం యాక్టింగ్ తోనే దాదాపు రూ. 700కోట్లు సంపాదించిందని టాక్ ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇక్రా అజీజ్ ఈ బ్యూటీ పేరు మనదగ్గర పెద్దగా తెలియకపోవచ్చు .. ఈ అమ్మడు పాకిస్థాన్ నటి. అక్కడ ఎంతో పాపులర్ ఈ బ్యూటీ. టీవీ షోలతో కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నటిగా తనుతాను నిరూపించుకుంది. ఆదేశంలోనే ఆమె రిచెస్ట్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్రా అజీజ్ చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది. దాంతో చిన్నప్పటి నుంచి తల్లే ఇంటి భారాన్ని మోసింది. ఇక్రా అజీజ్ చిన్న తనం నుంచే తల్లి పడ్డ కష్టలను, చేసిన త్యాగాలను చూస్తూ పెరిగింది.
ఆర్ధిక సమస్యల కారణంగా ఆమె ఉన్నత చదువులు చదవలేకపోయింది. ఇక 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టలను ఎదుర్కొంది. కిస్సే అప్నా కహే’ టీవీ షోతో ఆమె కెరీర్ స్టార్ట్ అయింది. ఆతర్వాత పలు టీవీ షోలు చేసిని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రముఖ పాకిస్థానీ నటుడు, రైటర్ యాసిర్ హుస్సేన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఈ ఇద్దరి మధ్య 14ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. 2019లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఇక్రా అజీజ్ పాక్ లో అత్యత సంపన్న నటి. ఆమె స్కెవలం నటనతోనే రూ. 700కోట్లకు పైగా సంపాదించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి