Most Recent

Honey Rose: ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు.. అయినా ఆ కోరిక నెరవేరలేదంటున్న హనీరోజ్

Honey Rose: ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు.. అయినా ఆ కోరిక నెరవేరలేదంటున్న హనీరోజ్

హానీ రోజ్.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది . హనీరోజ్.. తెలుగులో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు నటన పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే హనీరోజ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. హనీ రోజ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉం ట్ తాజాగా హానిరోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని అయినా కూడా తనకు ఆశించిన స్థాయిలో పాత్రలు రాలేదు అని చెప్పుకొచ్చింది ఈబ్యూటీ.

హానిరోజ్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయిందని, తన హృదయానికి దగ్గరగా ఉండే పాత్ర ఇంకా రాలేదని తెలిపింది హానిరోజ్. తన మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో మలయాళ సినిమాలో చాలా సమస్యలను ఎదుర్కొన్నానని కూడా తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. తాను నటించిన చిత్రాల కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ లో పాల్గొనడం ద్వారానే ఎక్కువ ప్రసిద్ధి చెందానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హనీరోజ్ ఇన్ స్టా..

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.