
ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా ఊహించని విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ అంచనాలు మధ్య విడుదలై దారుణంగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పటికే భారీ హైప్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమా మాత్రం మరీ దారుణం.. రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ రిలీజ్ తర్వాత సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? మాములుగా సినిమాలు నిరాశపరిచిన అంతో ఎంతో వసూల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం రూ.80 కోట్ల బడ్జెట్ తీస్తే.. రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన సినిమా రాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా టాలీవుడ్ సినిమా కాదు. ఇది బాలీవుడ్ సినిమా. ఈ సినిమా పేరు ఆజాద్. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది. పైగా హీరో, హీరోయిన్ కూడా స్టార్ కిడ్స్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ సోదరుడి కుమారుడు అమన్ దేవ్‌గన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అలాగే హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు రాషా తదాని డెబ్యూ చేసింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. రూ. 80కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై హైప్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ రోజే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం సినిమారా బాబూ..! జనాలు తలలు పట్టుకునేల చేసింది ఈ మూవీ. దాంతో ఈ సినిమా ఇండస్ట్రీ టాక్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.