Most Recent

Geeta Singh: రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణం.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన గీతా సింగ్

Geeta Singh: రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణం.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన గీతా సింగ్

నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఎవడి గోల వాడిదే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైందీ బొద్దుగుమ్మ. కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖా పరిణయం, ఆకాశ రామన్న, సీమ టపాకాయ్‌, కెవ్వు కేక, ‘కళ్యాణ వైభోగమే’ ‘రెడ్, జంప్ జిలానీ, సరైనోడు, ఈడో రకం అడో రకం, తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019 తర్వాత కేవలం రెండు సినిమాల్లో మాత్రమే ఈ బొద్దుగుమ్మ కనిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సడెన్ గా యాక్సిడెంట్ లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది.

గురువారం (ఫిబ్రవరి 18) గీతాసింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిందామె. ‘తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

గీతా సింగ్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో..

కాగా గీతాసింగ్‌ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. అయితే తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటోంది. ఈ క్రమంలోనే పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. గీతా సింగ్ చివరిగా ఇంటి నెంబర్ 13 అనే సినిమాలో నటించింది. ఇది గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గీతా సింగ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.