-
వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుంటే, ఎవరైనా రెమ్యునరేషన్‌ని చకచకా పెంచేస్తారు. కానీ ఆ విధానానికి దూరంగానే ఉన్నారు శ్రీలీల. ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా పారితోషికం విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అయ్యారు.
-
తన కెరీర్‌కి హెల్ప్ అవుతాయనుకున్న స్టార్ హీరోల సినిమాలకు మోస్తరు పారితోషికాన్నే డిమాండ్ చేసేవారు ఈ బ్యూటీ. అదే, తాను ఆ సినిమాకు ప్లస్ అవుతాననుకుంటే మాత్రం కచ్చితంగా బిగ్ అమౌంట్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్.
-
ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ సేమ్ థీమ్‌నే ఇంప్లిమెంట్ చేస్తారా? లేకుంటే, ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్రేజ్‌ని అక్కడ క్యాష్ చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ తన ప్లానింగ్‌కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి, ఉత్తరాదిన కూడా ఇదే వర్కవుట్ చేస్తారనే మాటలు కూడా స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి.
-
ప్రస్తుతం తెలుగులో రవితేజకి జోడిగా మాస్ జాతర, నితిన్ సరసన రాబిన్‌హుడ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రంలోకథానాయకిగా నటిస్తుంది. అలాగే తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికి 3 సినిమాల్లో నటిస్తుంది.
-
హిందీలో మరికొన్ని సినెమాలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినెమాలన్నీ హిట్ అయితే ఇక శ్రీలీల కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉంటుంది. చుడాలిక ఏమి జరగనుందో.