Most Recent

Honey Rose: ‘ఆ వ్యాపారవేత్త తప్పుగా మాట్లాడుతున్నాడు..’ తాట తీస్తానని హనీ రోజ్ వార్నింగ్

Honey Rose: ‘ఆ వ్యాపారవేత్త తప్పుగా మాట్లాడుతున్నాడు..’ తాట తీస్తానని హనీ రోజ్ వార్నింగ్

తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్నట్లు నటి హనీరోజ్‌ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు ఆలోచనలతో..  ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని వాపోయింది. చాలా మంది సెలబ్రిటీలతో పాటే గతంలో అతని బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్లేదాన్ని అని హనీ రోజ్ తెలిపింది. ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో తనను డబుల్‌ మీనింగ్‌తో పిలిచాడని..  మీడియా ముందు కూడా తనపై చులకన వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది. అసౌకర్యం అనిపించి.. ఆ బిజినెస్‌మెన్‌ ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేసినట్లు తెలిపింది.

తన పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ ఆ వ్యాపారవేత్త భావిస్తున్నారని హనీ రోజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్న తాను ఈ వేధింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించనని స్పష్టం చేసింది. వెకిలి మాటలకు చట్టపరంగానే సమాధానం చెబుతానని హనీ రోజ్ తన పోస్టులో పేర్కొంది.  తన మౌనం చేతగాని తనం అనుకోవద్దని హెచ్చరించింది.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

అయితే హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్‌పై కొందరు అభ్యంతరకర కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె ఎర్నాకులం సెంట్రల్  పోలీసులను ఆశ్రయించడంతో.. 27 మందిపై కేసు నమోదు అయ్యాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. వీరసింహారెడ్డి  సినిమాతో హనీరోజ్‌ తెలుగునాట తెగ ఫేమస్ అయిపోయింది. ఈ మలయాళ నటి 2008లో ఆలయం సినిమాతో తెలుగనాట ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో నటించింది. లాంగ్ గ్యాప్‌ తర్వాత వీరసింహారెడ్డితో బాలయ్య సరసన మెరిసింది. ప్రస్తుతం మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. త్వరలో  రాచెల్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.