Most Recent

Keerthy Suresh: ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్..

Keerthy Suresh: ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సినిమా చేసేదాన్ని కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్..

హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ చిత్రాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. అందం, అభినయంతో కట్టిపడేసిన కీర్తికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కీర్తి. మహానటి సినిమాకు గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. కెరీర్ తొలినాళ్లల్లో కేవలం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన కీర్తి.. ఇప్పుడు గ్లామర్ పాత్రలలోనూ కనిపించింది. కెరీర్ మంచి ఫాం మీద ఉన్నప్పుడే తన స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకుంది.

గతేడాది డిసెంబర్ 12న తన స్నేహితుడు ఆంటోనిని గోవాలో పెళ్లి చేసుకున్నారు కీర్తి. పెళ్లి తర్వాత మరో సినిమాను అనౌన్స్ చేయలేదు కీర్తి. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటిన కీర్తి.. ఇటీవలే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి సినిమాకు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ భేటీలో పాల్గొన్న కీర్తి బేబీజాన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బేబీ జాన్ సినిమాకు ముందు రఘు తాత అనే సినిమాలో నటించింది కీర్తి. హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకునే తీరాలంటూ ఒత్తిడి చేయడాన్ని తప్పు అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ లో హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్ ఉంటుంది. రఘుతాత సినిమా తర్వాత బేబీ జాన్ సినిమాలో నటించింది కీర్తి. దీంతో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారని పేర్కొంది. హిందీ భాషకు వ్యతిరేకంగా రూపొందించిన చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చావు అంటూ తనను విమర్శించారని చెప్పుకొచ్చింది. హిందీ భాషకు వ్యతిరేకంగా ఏ సినిమా రాలేదని.. కానీ భాషను కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ వచ్చిన సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది కీర్తి.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.