Most Recent

Vishal: అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌లో ఆందోళన 

Vishal: అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌లో ఆందోళన 

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.

అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోహం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. అయితే నిజంగా చలి జ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీమ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వణుకుతూ మాట్లాడుతోన్న విశాల్.. వీడియో

నటి ఖుష్బూతో విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.