Most Recent

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం.. భారీగా వ్యాపించిన మంటలు

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం.. భారీగా వ్యాపించిన మంటలు

నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్‌లోని నవ్రోజ్ హిల్ సొసైటీ అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మార్చి 6) మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు జంబో ట్యాంకర్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.  ఈ బిల్డింగ్ లో 17 అంతస్తులు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 14వ అంతస్థులోని ఒక వంట గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇదే భవనంలో 15వ అంతస్థులో నివసిస్తున్నారు. ఆమెకు 5 బిహెచ్‌కె ఇల్లు ఉంది. 2023లో జాక్వెలిన్ ఇక్కడ ఇల్లు  కొనుక్కుంది. గతేడాది జులైలో ఆమె తన ఇంటి వీడియో వైరల్‌గా మారింది.

ఈ భవనంలో చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తున్నారు.  సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ అలాగే  మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ పక్కపక్కనే నివసిస్తున్నారు. ఈ భవనానికి సమీపంలోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా ఉంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా ఇదే ప్రాంతంలో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడ ఓ యాక్షన్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సెట్‌లోని ఓ ఫోటోను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అలాగే రూ.200 కోట్ల మోసం కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాల వల్ల జాక్వెలిన్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.