Most Recent

ఏంది సామీ ఈ అరాచకం.. వేణుస్వామితో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు.. మధ్యలో లిక్కర్

ఏంది సామీ ఈ అరాచకం.. వేణుస్వామితో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు.. మధ్యలో లిక్కర్

ఆమధ్యకాలంలో ఓ పెద్దాయన పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆయన సినిమాలకు సంబందించిన వ్యక్తి కాదు కానీ అయన పేరు నిత్యం వైరల్ అవుతూనే ఉంది. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. సినీ సెలబ్రెటీల జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. సినిమా కపుల్ ఎప్పుడు విడిపోతారో చెప్తూ వైరల్ అయ్యారు వేణు స్వామి. మొదట్లో సమంత నాగచైతన్య విడిపోతారు అని తెలిపి షాక్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే సామ్, నాగ చైతన్య విడిపోయారు దాంతో ఆయన చెప్పినవి జరుగుతున్నాయని ప్రచారం గట్టిగా జరిగింది. ఆతర్వాత చాలా మంది సెలబ్రెటీల ఆరోగ్యాల గురించి, పెళ్లిళ్ల గురించి, చావుల గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. ప్రముఖులు అనారోగ్యానికి గురవుతారు అని వేణు స్వామి చెప్పినప్పుడల్లా ఆడియన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే నిధి అగర్వాల్, అషు రెడ్డి, ఇనయ సుల్తానాలాంటివారు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోల పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

డింపుల్ హయతి వేణు స్వామితో పూజలు చేయించుకున్న డింపుల్ హయతి పూజ మధ్యలో వైన్ బాటిల్ కనిపించడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే వేణు స్వామి పూజలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పూజలో తీర్ధం బదులు ఆయన మద్యాన్ని ఉంచుతారు. అయితే ఎవరు ఏది తాగితే అదే పూజలో ఉంచుతానని ఆయన తెలిపారు. నేను చేసే వామాచార పూజలు బాగాలమ్మకు, రాజ శ్యామల, తార, చిన్నమస్త ఇలా ప్రతి ఒక్క పూజకు కూడా నేను లిక్కర్ నే వాడతాను. అలాగే తీర్ధంలో దాన్ని కలిపి ఇస్తాను అని చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.