Most Recent

Siddharth: ఇదేం క్రేజ్ రా సామీ.. ‘ఓయ్’ రీరిలీజ్.. ఫ్యాన్స్ చేసిన పనికి ఇబ్బందిపడిన సిద్ధార్థ్..

Siddharth: ఇదేం క్రేజ్ రా సామీ.. ‘ఓయ్’ రీరిలీజ్.. ఫ్యాన్స్ చేసిన పనికి ఇబ్బందిపడిన సిద్ధార్థ్..

రీరిలీజ్ ట్రెండ్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. ఒకప్పుడు మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు ఇప్పుడు మళ్లీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇన్నాళ్లు టీవీల్లో చూసిన సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీరిలీజ్ కాగా.. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ హిట్ ‘ఓయ్’ మళ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని చూసేందుకు సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. 2009లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ అందుకున్న అందుకున్న ఈ సినిమాకు.. ఇప్పుడు మాత్రం సెన్సెషనల్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అన్ని చోట్లా అనూహ్య స్పందన వస్తోంది. ఓయ్ సినిమా పాటలకు థియేటర్లలో యూత్ డాన్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ముందుగా చెప్పినట్లే హీరో సిద్ధార్థ్ ను ఓయ్ రీరిలీజ్ థియేటర్ కు తీసుకువచ్చారు డైరెక్టర్ ఆనంద్ రంగా. శుక్రవారం హైదరాబాద్‌లోని శాంతి థియేటర్‌లో జరిగిన సినిమా ప్రదర్శనకు సిద్ధార్థ్, డైరెక్టర్ ఆనంద్ రంగా హాజరై అభిమానులతో కలిసి సినిమా చూశారు. అయితే సిద్ధార్థ్ కు థియేటర్ వద్ద ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి చాలా సంతోషించారు. సిద్ధార్థ్ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు . సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా థియేటర్లో ‘ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ’ పాట పాడి మరింత జోష్ నింపారు సిద్దూ. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

అయితే సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తుండగా సిద్ధార్థ్‌ చాలా ఇబ్బందిపడ్డాడు. ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి.. ఆటోగ్రాఫ్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో గందరగోళం నెలకొంది. సిద్ధార్థ్ ను అభిమానులు నెట్టేశారు. దీంతో అతను బ్యాలెన్స్ కోల్పోయి అసౌకర్యంగా ఫీలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఓయ్ సినిమాలో సిద్ధార్థ్ జోడిగా షామిలీ కథానాయికగా నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.