బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా షూటింగ్ తో బిజిబిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా ఉన్నాడు. సినిమాలో అక్షయ్-టైగర్ ల మధ్య పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 9న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే యాక్షన్ సీన్స్ లో నటించడం వల్ల ప్రమాదాలు తలెత్తుతాయని, ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తాయంటున్నాడీ సీనియర్ హీరో. ఈ మేరకు గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు చేసుకున్నాడు అక్షయ్. అతను నటించిన ‘బ్లూ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్ మృత్యువు దగ్గరకు వెళ్లొచ్చారట. దీనిపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడన అక్షయ్.. ‘ ‘బ్లూ’ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఆక్సిజన్ ట్యాంక్ సహాయం లేకుండా నీటి అడుగున స్టంట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదకర స్టంట్‌ను 150 అడుగుల నీటిలోనే చేయాల్సి వచ్చింది. ఈ స్టంట్ చేస్తున్నప్పుడు ప్రమాదవవశాత్తూకు గాయం తగిలి రక్తం ధారలా కారింది. విపరీతమైన రక్తస్రావం , దాని వాసన కారణంగా దాదాపు 40-45 సొరచేపలు నన్ను చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాను. వాటి నుంచి తప్పించుకుని వస్తుంటే ఒక చేప నన్ను చివరి వరకు వెంబడించింది. ఆ చేపలు నన్ను తినేస్తాయేమోననుకున్నా. అయితే అదృష్టవశాత్తూ వాటి నుంచి నేను సురక్షితంగా బయటపడ్డా’ అని అక్షయ్ తెలిపారు.
దాదాపు రూ.80 కోట్లతో ‘బ్లూ’ చిత్రాన్ని తెరకెక్కించారు. 2009లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు కత్రినా కైఫ్, సంజయ్ దత్, లారా దత్తా, జాయెద్ ఖాన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. సినిమా ఎక్కువగా అండర్ వాటర్ సీన్స్ లోనే చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ లోనే సొరచేపల బారి నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ ట్వీట్.,.
Blessed to be a part of the inauguration of the BAPS Swaminarayan temple at Abu Dhabi. What a historic moment!! pic.twitter.com/TOPhk55omI
— Akshay Kumar (@akshaykumar) February 14, 2024
అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయం.. వీడియో ఇదుగో..
The first Hindu temple in Abu Dhabi is set to be inaugurated on the 14th by PM Modi! Let’s also appreciate the incredible craftsmanship of @BAPS temples around the world. Sharing a glimpse of Akshardham temple in Delhi #BAPS #Akshardham #AbuDhabi #uae #BAPSHinduMandir pic.twitter.com/bsznrBZ1Cu
— Nazariyaa || Himachal || Kullu || Delhi (@nazariyaa__) February 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.