Most Recent

Sai Pallavi: చెల్లి నిశ్చితార్థం వేడుకలో సాయి పల్లవి హంగామా.. తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ సందడి.. వీడియో

Sai Pallavi: చెల్లి నిశ్చితార్థం వేడుకలో సాయి పల్లవి హంగామా.. తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ సందడి.. వీడియో

సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ తన చిరకాల ప్రియుడితో త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఇటీవలే తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన పూజ.. తన లవర్‌ వినీత్‌ను కూడా అందరికీ పరిచయం చేసింది. తాజాగా పూజ, వినీత్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి పల్లవి తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేసింది. పూజ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి పల్లవి సోదరి పూజ కూడా సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా స‌క్సెస్ కాలేదు. పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో అవకాశం రాలేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి మేనేజర్‌గా ఉంటోంది పూజ. షూటింగ్‌లు, ప్రమోషన్స్‌ అన్నింటిలోనూ ఆమె సాయి పల్లవికి తోడు, నీడగా ఉంటోంది. ఇతర పనులలో సోదరి షూటింగ్ తేదీలను నిర్వహించడం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్న పూజ మరి అక్క మేనేజర్ గా కొనసాగుతుందేమో చూడాలి.

 

పూజ ఇప్పుడు తన ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వినీత్, పూజ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా తెలిపాయి. దీంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో సాయి పల్లవి సంప్రదాయ నృత్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవితో పాటు పూజా కుటుంబసభ్యులు కూడా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. వారం రోజుల క్రితం పూజ తన ప్రియుడు వినీత్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ‘నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటో ఈ అందమైన అబ్బాయి నాకు నేర్పించాడు. ప్రేమలో సహనం, దృఢత్వం మరియు ఉనికిని ఎలా అందంగా ఉంచుకోవాలో నేర్పించారు. ఇతను వినీత్.. నా సన్ షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్ నర్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్ నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్ నర్” అంటూ తన ప్రేమికుడిని పరిచయం చేసింది పూజ.

 

సాయి పల్లవి డ్యాన్స్ వీడియో..

సోదరి పూజతో సాయి పల్లవి..

తీన్మార్ డ్యాన్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.