Most Recent

Oscars 2024: ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. భారతదేశం నుంచి ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయంటే..

Oscars 2024: ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. భారతదేశం నుంచి ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయంటే..

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఆస్కార్. యావత్తు సినీ కళాకారులంతా ఈ అవార్డ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతేడాది భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‏గా ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఇక ఇప్పుడు 96వ అకాడమీ అవాడ్స్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. గతరాత్రి ఆస్కార్ అవార్డ్ నామినేషన్లను ప్రకటించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఇలా ఇరవై మూడు విభాగాల్లో 120కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్స్ ప్రకటించారు. ఇందులో ‘ఓపెన్ హైమర్’, ‘ది పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, బార్బీ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ దక్కించికున్నాయి. ఈ నామినేషన్స్ ప్రకటనకు అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్ గోల్డ్ విన్ థియేటర్ వేదికగా మారింది. మార్చి 11న ఈ ఏడాది ఆస్కర్ విజేతలు ఎవరనేది తెలియనుంది. ఇంతకీ 96వ అకాడమీ అవార్డ్స్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఏంటో చూద్దామా.

బెస్ట్ మూవీస్..

  • అమెరికన్ ఫిక్షన్..
  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్..
  • బార్బీ..
  • ది హోల్డోవర్స్..
  • కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్..
  • మాస్ట్రో..
  • ఓపెన్ హైమర్..
  • పాస్ట్ లైవ్స్..
  • పూర్ థింగ్స్..
  • ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్..

ఉత్తమ నటుడు..

  • బ్రాడ్లే కూపర్.. మాస్ట్రో..
  • కూల్ మాన్ డోమింగో.. రస్టిన్..
  • పాల్ గిమ్మట్టి.. ది హోల్డోవర్స్..
  • సిలియన్ మార్ఫి.. ఓపెన్ హైమర్..
  • జెఫ్రీ రైట్.. అమెరికన్ ఫిక్షన్.

ఉత్తమ నటి..

  • అన్నెట్ బెనింగ్ – న్యాద్
  • లిల్లీ గ్లాడ్‌స్టోన్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • సాండ్రా హల్లెర్ – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  • కారీ ముల్లిగాన్ – మాస్ట్రో
  • ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్

ఉత్తమ సహయనటి..

  • ఎమిలీ బ్లంట్ – ఒపెన్‌హైమర్
  • డేనియల్ బ్రూక్స్ – ది కలర్ పర్పుల్
  • అమెరికా ఫెర్రెరా – బార్బీ
  • జోడీ ఫోస్టర్ – న్యాద్
  • డావిన్ జాయ్ రాండోల్ఫ్ – ది హోల్డోవర్స్

ఉత్తమ సహాయ నటుడు..

  • స్టెర్లింగ్ కె బ్రౌన్ – అమెరికన్ ఫిక్షన్
  • రాబర్ట్ డి నీరో – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • రాబర్ట్ డౌనీ జూనియర్ – ఓపెన్‌హైమర్
  • ర్యాన్ గోస్లింగ్ – బార్బీ
  • మార్క్ రుఫెలో – పూర్ థింగ్స్

ఉత్తమ దర్శకుడు..

  • అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ – జస్టిన్ ట్రైట్
  • కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ – మార్టిన్ స్కోర్సెస్
  • ఒపెన్‌హైమర్ – క్రిస్టోఫర్ నోలన్
  • పూర్ థింగ్స్ – Yorgos Lanthimos
  • ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ – జోనాథన్ గ్లేజర్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..

  • అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  • హోల్డోవర్స్
  • మాస్ట్రో
  • మే డిసెంబర్
  • పాస్ట్ లైవ్స్..

బెస్ట్ ఒరిజినల్ సాంగ్..

  • ది ఫైర్ ఇన్‌సైడ్ – ఫ్లామిన్ హాట్ (డయాన్ వారెన్)
  • ఐ యామ్ జస్ట్ కెన్.. బార్బీ (మార్క్ రాన్సన్, ఆండ్రూ వ్యాట్)
  • ఇట్ నెవర్ వాంట్ అవే – అమెరికన్ సింఫనీ (జాన్ బాటిస్ట్, డాన్ విల్సన్)
  • Wahzhazhe (నా ప్రజల కోసం ఒక పాట) – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (స్కాట్ జార్జ్)
  • వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ ? – బార్బీ (బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్)

బెస్ట్ యాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్..

  • బోబీ వైన్: పీపుల్స్ ప్రెసిడెంట్
  • ది ఎటర్నల్ మెమరీ
  • ఫోర్ డాటర్స్..
  • టూ కిల్ ఏ టైగర్.. (ఇండియా)
  • 20 డేస్ ఇన్ మరియపూల్..

అయితే ఈసారి అకాడమి అవార్డ్స్ నామినేషన్లకు అధికారికంగా వెళ్లిన మలయాళ మూవీ ఈ నామినేషన్లలో స్థానం దక్కించుకోలేకపోయింది. 96వ ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ పూర్తి వివరాలను ఈ కింద లింక్ లో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.