వ్యూహం సరే.. సినిమా విడుదలకు దారేది? సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలైంది. రాంగోపాల్ వర్మ వ్యూహం విడుదల వివాదాల చక్రవ్యూహంలో చిక్కుకుంది. సెన్సార్ సర్టిఫికెట్ వుందన్న ఆర్జీవీ ధీమాకు హైకోర్టులో చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన హైకోర్టు .. మరోసారి వ్యూహం మూవీని రివ్యూ చేసి 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డ్‌ను ఆదేశించింది. వ్యూహం మూవీలో కొన్ని సీన్లు సీన్లు చంద్రబాబును కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ హైకోర్టులో టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. సెన్సార్ బోర్డు నివేదికను పరిశీలించాక తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది. ఐతే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది వ్యూహం మూవీ యూనిట్.
వ్యూహం చిత్రం సినిమాలో వివిధ పార్టీలకు చెందిన పెద్దలు, నేతల పాత్రల్ని కించపరిచేలా సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని పెద్దయెత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే.. రిలీజ్ చేసిన ట్రైలర్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. గతంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులోనూ టీడీపీ పిటిషన్ వేయగా.. విచారణ జరిపి.. ఓటీటీల్లో వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇచ్చింది.
Me celebrating @NaraLokesh ‘s victory over VYOOHAM .. But my victory party will be 100 TIMES BIGGER pic.twitter.com/eQg6zt2jQC
— Ram Gopal Varma (@RGVzoomin) January 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి