బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గానే కాదు హాట్ బ్యూటీగాను దూసుకుపోతుంది దీపికా పదుకొణె. ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీ కడుతూ టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న దీపికా అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గడం లేదు.. నిజానికి పెళ్లి తర్వాత ఈ భామ మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుందన్న టాక్ కూడా ఉంది. మొన్నామధ్య షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో బికినీ సీన్స్ లో రెచ్చిపోయింది. సీన్స్ లోనే కాదు.. ఓ సాంగ్ లో బికినీలో మెరిసింది. అంతేనా బికినీ లో ఓ ఫైట్ కూడా చేసింది ఓయమ్మో అనిపించింది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ ఫైటర్ కోసం కూడా మరోసారి బికినీలో దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చేస్తున్న గ్లామర్ షోకి లేనిపోని కష్టాలు వస్తున్నాయి.
పఠాన్ మూవీ విడుదల సమయంలో సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్) దీపికా పదుకొనే ‘బేషరమ్ రంగ్’ పాటకు 10 కట్‌లను సూచించింది. ఆ పాటలో దీపికా పదుకొణె బికినీలో యమా హాట్ గా డ్యాన్స్ చేసింది. దీపిక ధరించిన బికినీ రంగుపై కూడా వివాదం నెలకొంది. ఇప్పుడు ‘ఫైటర్’ సినిమాలో దీపికా బికినీ ధరించి ఓ పాటలో కనిపించడంతో సీబీఎఫ్‌సీ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విశేషమేమిటంటే రెండు సినిమాల దర్శకుడు ఒక్కరే.
హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని ఓ పాటలో దీపికా పదుకొణె బికినీలో కనిపించింది .అదే పాటలో హృతిక్ రోషన్ కూడా తన షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఎఫ్‌సీ.. రెండు కట్‌లను సూచిస్తూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతని లాస్ట్ మూవీ ‘పఠాన్’లో కూడా దీపికా పదుకొణె బికినీలో డ్యాన్స్ చేసింది. దాంతో ఆయన చాలా వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. అయినా కూడా ఈ సినిమాలో మళ్లీ అదే చేశాడు. దేశభక్తి సినిమా అయినా కూడా ఆ పాట వల్ల యూ కాకుండా యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. దీని గురించి సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ, ‘సీబీఎఫ్‌సీ కోతల గురించి నేను పెద్దగా బాధపడటం లేదు. అవి సినిమా ఫ్లోకి భంగం కలిగించవు. నా సినిమా కథలో అన్నీ సహజంగానే జరుగుతాయి. బలవంతం చేయలేదు. నా సినిమాకు అవసరమైనప్పుడు ఆ సన్నివేశాన్ని, పాటను రూపొందించాను. సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉంది, అవి అనుసరించాల్సినవని మాకు కూడా తెలుసు. ‘సీబీఎఫ్‌సీ సూచించిన కట్స్ గురించి ఇప్పుడు మేం పెద్దగా బాధపడటం లేదు. ఎందుకంటే ఆ సన్నివేశాలు సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో ఉంటాయి. కథ ముగిసిన తర్వాత వచ్చే సన్నివేశాల్లోని కొన్ని భాగాలను కట్ చేయమని చెప్పారు. ఇది సినిమా కథ ఉత్కంఠకు అంతరాయం కలిగించదు అని అన్నారు జనవరి 25న ఫైటర్ సినిమా విడుదలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి