Most Recent

Rajinikanth: నా కూతురు ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్

Rajinikanth: నా కూతురు ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే, కొన్నిసార్లు వివాదాలు ఆయన్ని వెతుకుంటూ వస్తాయి. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ సంచలనం సృష్టించింది. ఆమె వాడిన ‘సంఘి’ అనే పదం చర్చకు దారితీసింది. ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కూతురు ఇచ్చిన స్టేట్ మెంట్ ను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్. రజనీకాంత్ మాట్లాడుతూ ‘సంఘీ అనే పదం చెడ్డదని నా కూతురు ఎప్పుడూ అనలేదు అని అన్నారు.

‘లాల్ సలామ్’ ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 26న చెన్నైలో జరిగింది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ వేదికపై ఐశ్వర్య మాట్లాడారు. మా నాన్నను సంఘీ అని పిలవడం మానేయండి’ అని ఐశ్వర్య అన్నారు.

‘నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ, నా సహచరులకు ఎప్పుడూ ఏదో ఒకటి చూపించాలి. అది చూస్తే నాకు కోపం వస్తుంది. మనం కూడా మనుషులమే. ఇటీవల చాలా మంది మా నాన్నను సంఘీ అని పిలుస్తున్నారు. దాని అర్థం నాకు తెలియలేదు. కాబట్టి నేను దాని అర్థం విన్నాను, అర్థం చేసుకున్నాను. ఫలానా పార్టీకి మద్దతిచ్చే వారిని సంఘీ అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాను. మా నాన్న సంఘీ కాదు. ఆయన సంఘీ అయితే లాల్ సలామ్ లాంటి సినిమా చేసేవారు కాదు ‘ అని ఐశ్వర్య అన్నారు. కూతురు మాట విన్న రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఐశ్వర్య ప్రకటనపై పలువురు విమర్శలు గుప్పించారు. ఐశ్వర్య సంఘీ అంటే చెడ్డ అర్థం వచ్చేలా మాట్లాడిందని పలువురు విమర్శించారు. ఇప్పుడు ఈ విషయంపై రజనీకాంత్ స్పందించారు.తాజాగా ఆయన  చెన్నై విమానాశ్రయంలోపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కూతురు సంఘీ అనేది చెడ్డ పదం అని ఎప్పుడూ అనలేదు.’మా నాన్నగారిని ఎందుకు బ్రాండింగ్ చేస్తున్నారు.? ” అని మాత్రమే అన్నది అని అన్నారు.

గతేడాది ‘జైలర్‌’ సినిమాతో రజనీకాంత్‌ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘లాల్ సలామ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.