Most Recent

ఎక్కడి నుంచి పట్టుకొస్తావ్ అన్న.. అల్లాడించేశావ్‌గా..! ఆర్జీవీ వీడియో పై నెటిజన్స్ రియాక్షన్

ఎక్కడి నుంచి పట్టుకొస్తావ్ అన్న.. అల్లాడించేశావ్‌గా..! ఆర్జీవీ వీడియో పై నెటిజన్స్ రియాక్షన్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎం చేసిన సంచలనమే.. వివాదాలు వర్మకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవిత కథలను తెరకెక్కించి వర్మ హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా అనేక చిక్కుల్లో చిక్కుకుంది. ఇదిలా ఉంటే మొన్నమధ్య వరుసగా ఓ అమ్మాయి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లను షేర్ చేస్తు ఆకట్టుకున్నారు వర్మ. ఎవరో కేరళా అమ్మాయి ఇన్ స్టా గ్రామ్ వీడియోలు వర్మ ఎందుకు షేర్ చేస్తున్నారా అని అంతా అనుకున్నారు. ఆమె అందానికి ఫిదా అయినా ఆర్జీవీ తనను పొగుడుతూ ఆమె పెట్టిన పోస్ట్ లను తన అకౌంట్ లో రీపోస్టు చేశారు. అంతే కాదు ఆమె ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ ను రిక్వెస్ట్ కూడా చేశారు ఆర్జీవీ.  దాంతో నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. ఆర్జీవీ ఆమెతో సినిమా చేస్తున్నారేమో.. మరో హీరోయిన్ ను పట్టుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు..

ఎస్.. మొత్తానికి ఆ అమ్మాయిని కనిపెట్టారు ఆర్జీవీ.. ఆమెతో ఓ సినిమా అనౌన్స్ చేశారు.. చీర కట్టుతో పట్టిపడేస్తున్న అమ్మడితో శారీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.  తాజాగా మరోసారి ఆ అమ్మాయి వీడియోను షేర్ చేశారు వర్మ.

ఆ అందమైన అమ్మాయికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయి సంగీతం వింటుందా..? లేక ఆ అమ్మయి నుంచే సంగీతం వస్తుందా..? అని రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్జీవీ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తావ్ అన్న.. అల్లాడించేశావ్ గా.. అంటూ కామెంట్స్  చేస్తున్నారు నెటిజన్స్.

ఆర్జీవీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)

శారీ మూవీ హీరోయిన్

శారీ మూవీ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.