Most Recent

Pushpa 2: రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు.. ఒక్కఫోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన పుష్ప టీమ్

Pushpa 2: రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు.. ఒక్కఫోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన పుష్ప టీమ్

అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. ‘పుష్ప 2 ‘ సినిమా అనుకున్న రోజుకి విడుదల అవుతుందా లేదా అనే సందేహం నెలకొంది.. ‘పుష్ప 2’ సినిమా విడుదల వాయిదా పడిందని.. రిలీజ్ కు చాలా టైం ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే అది నిజం కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే స్పష్టం చేశారు. పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ ఇస్తూ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు.

‘పుష్ప 2’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప 2′ సినిమా విడుదల కానుంది. ఇక మిగిలింది 200 రోజులు మాత్రమే అంటూ ఈ పోస్టర్ ద్వారా స్పష్టంగా చెప్పారు. దాంతో అన్ని గాసిప్స్‌కి తెరపడింది.

సరైన తేదీకి సినిమాను విడుదల చేయడం చాలా ముఖ్యం. అందుకోసం భారీ బడ్జెట్ సినిమాలు ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటాయి. స్వతంత్రదినోత్సవం రోజున సినిమాలు రిలీజ్ చేసేందుకు చాలా మంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప2’ టీమ్ కూడా ఆ తేదీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అనుకున్నట్లుగానే ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

‘పుష్ప 2’ ఇంకా 100 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకోనుంది. విడుదలకు ఇంకా 200 రోజుల సమయం ఉండడంతో అప్పటికి అన్ని పనులు పూర్తవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ‘పుష్ప 2’ కూడా ఉంది. ‘పుష్ప’ సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు దీని సీక్వెల్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.