Most Recent

Allu Arjun: పుష్ప 2 తర్వాత బన్నీ చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్.. ముందుగా చేసేది ఆ సినిమానేనా

Allu Arjun: పుష్ప 2 తర్వాత బన్నీ చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్.. ముందుగా చేసేది ఆ సినిమానేనా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు  ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయిపుష్ప సినిమా సంచనల విజయం సాధించడంతో దానికి మించి పుష్ప 2 ఉండేలా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ఏ సినిమాని ముందు చేస్తాడా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘పుష్ప’ చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక ఇప్పుడు  ‘పుష్ప 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌కి కథ చెప్పాడట. వీరిద్దరూ గతంలో ‘సరైనోడు’లో కలిసి పనిచేశారు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల చేయాలనీ సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్. ఇటీవలే బోయపాటి తో సినిమా చేస్తున్నట్టు అల్లు అరవింద్ కన్ఫర్మ్ చేశారు. కానీ హీరో ఎవరు అన్నది అనౌన్స్ చేయలేదు.

అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడు. కానీ, ఈ సినిమా ఇప్పట్లో మొదలవ్వదని తెలుస్తోంది. అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. అల్లు అర్జున్‌కి మూడు బెస్ట్ ఛాన్సులు వచ్చాయి. మరి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. పుష్ప 2’లో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్..

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.