Most Recent

Guntur Kaaram: విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సెన్సెషన్.. ప్రీ సెల్స్‏లో మహేష్ బాబు హవా..

Guntur Kaaram: విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సెన్సెషన్.. ప్రీ సెల్స్‏లో మహేష్ బాబు హవా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరీ కథానాయికలుగా నటించారు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఎప్పటికప్పుడు సరికొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్ననే జరగాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో ఈవెంట్ వాయిదా వేసింది చిత్రయూనిట్. దీంతో ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే గుంటూరు కారం ప్రీసెల్స్ లో సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సెల్స్ లో దూసుకెళ్తుంది. ఇప్పటికే అక్కడ రికార్డ్ షోలతో ఎన్నో లొకేషన్లతో రిలీజ్ అవుతుంది. తాజాగా ప్రీ సెల్స్ పరంగా 500K డాలర్స్ సొంతం చేసుకున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయిన ప్రత్యంగిరా సినిమాస్ వారు ప్రకటించారు. ఇంకా చాలా ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదని.. మంగళవారం ఆయా ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు తెలిపారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లోనూ గుంటూరు కారం హవా కొనసాగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.