సినిమాలు, కాంట్రవర్సీలు ఈ రెండింటినీ విడదీసి చూడలేని పరిస్థితి. ఒకప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే సినిమాలకు ఇప్పుడు కాంట్రవర్సీలు కామన్‌గా మారిపోయాయి. పాటలు, డైలాగ్స్, సినిమా కథ పరమైన అంశాలు వివాదాలకు కేరాఫ్‌గా మారిన సందర్భాలు చూసి ఉంటాం. అయితే తాజాగా సినిమా టైటిల్స్ కూడా వివాదాలుగా మారుతున్నాయి. తాజాగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కొత్త చిత్రం ఇలాగే టైటిల్‌తోనే కాంట్రవర్సీకి తెర తీసింది.
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్‌గా ఎల్‌ఐసీ (లవన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కన్ఫామ్ చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. దీంతో చిత్ర యూనిట్ ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో మంచి పేరు ఉన్న సంస్థను, ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసింది. వారంలోగా సినిమా టైటిల్ మార్చకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే కాతు వాక్కుల రెండు కాదల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విఘ్నేశ్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాతు వాక్కులలో సమంత, నయనతార హీరోయిన్‌లుగా నటించగా విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఇక ఎల్‌ఐసీ చిత్రాన్ని పూర్తి లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. లవ్ టుడేతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్‌కు జోడిగా ఈ సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే టైటిల్ వివాదంపై కోలీవుడ్ దర్శకుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు కుమారన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితమే తాను ‘ఎల్‌ఐసీ’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నానని, ఆ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయన్నారు. టైటిల్ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరి టైటిల్‌తోనే కాంట్రవర్సీలకు తెర తీసిన ఈ సినిమా మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి.మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..