
మహేష్ బాబ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పేరుకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లే కానీ చిత్ర యూనిట్ పెద్దగా అప్‌డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఒక చిన్న టీజర్ తప్ప ఇప్పటి వరకు మరో అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాగే సినిమా విడుదలపై కూడా రకరకాల వార్తలు షికార్లు చేశాయి. మొదట్లో ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలవుతుందన్నారు.
ఆ తర్వాత విడుదల తేదీ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఇలా గుంటూరు కారం చిత్ర విడుదలకు సంబంధించి రకరకాల వార్తలు షికార్లు చేశారు. హీరోయిన్లు మారారంటూ, స్క్రిప్ట్‌లో మార్పులు చేశారంటూ, సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదలపై సూర్యదేవర నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఆరు నూరైనా గుంటూరు కారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని నాగవంశీ తెలిపారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నామని తేల్చి చెప్పారు. ఇక దీపావళి కానుకగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ వారంలో సినిమాలో తొలి సింగిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ట్రైలర్‌తో పాటు ఇతర పాటలను విడుదల చేస్తూ సినిమా ప్రమోషన్స్‌ను పెంచే ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్. నిజానికి దసరాకు ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావంచింది కానీ అనివార్య కారణలతో వాయిదా పడింది. దీంతో దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు బెస్ట్ ఆల్బమ్‌గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..