
మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్‌లో ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పారు దర్శక ధీరుడు. అయితే దసరాకే పోస్టర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్న చర్చకు స్పందించారు వంశీ. తనకు ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని.. త్వరలోనే మాస్ జాతర సినిమాతో కలుస్తానని చెప్పారు నాగవంశీ.