Most Recent

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. శోభా దెబ్బకు ప్లేట్ తిప్పేసిన శివాజీ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. శోభా దెబ్బకు ప్లేట్ తిప్పేసిన శివాజీ

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ లో ఎప్పటిలానే అరుపులు, ఏడుపులు, గోలలతో రచ్చ రచ్చగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ, శోభా మధ్య గొడవ గట్టిగానే జరిగింది. మొన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా నిన్న శివాజీ ఆడిన గేమ్ లో శోభ సంచలక్ గా ఉంది. అయితే శోభా నిర్ణయాన్ని తప్పుబడుతూ శివాజీ వాదించాడు. ఆతర్వాత విజేత నిర్ణయం బిగ్ బాస్ శోభాకు వదిలేశాడు. ఇక నిన్న శోభాశెట్టి ఎప్పుడు సంచాలక్‌గా ఉన్నా ఫేవరిజమ్‌గానే డెసిషన్ తీసుకుంటుంది అంటూ శివాజీ యావర్ దగ్గర చెప్పుకున్నాడు. అమర్ లేదా ప్రియాంక అంటుంది. సందీప్ ఉన్నప్పుడు సందీప్ అనేది. మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంది అంటూ ఆవేశంతో మాట్లాడాడు. ఇక సంచలక్ గా ఉన్న శోభా శెట్టి, ప్రశాంత్ ఇద్దరు కలిసి విజేత గురించి డిస్కషన్ పెట్టారు.  బాల్స్ కింద పడిన దాన్ని బట్టి మన నిర్ణయం చెప్పేద్దాం’ అని ప్రశాంత్ అనేసరికి ఒక్కసారిగా సీరియస్ అయ్యింది శోభా.

బాల్స్ కింద పడిన దానిగురించి మాట్లాడుతున్నావ్.. మిగతా రూల్స్ గురించి మాట్లాడవేంటి. వందసార్లు అదే మాట్లాడుతున్నావ్ అంటూ రెచ్చిపోయింది. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ మండిపడింది. సరే నీ ప్రకారం విన్నర్ ఎవరో చెప్పు అని ప్రశాంత్‌ని అడిగింది . దానికి మనోడు ముగ్గురు బాగేనా ఆడారు అని చెప్పాడు. దానికి కూడా సీరియస్ అయ్యింది శోభా. అలా డిప్లమాటిక్‌గా ఆన్సర్‌లు చెప్పకు. అంది ఈలోగా శివాజీ అన్న అంటూ ప్రశాంత్ ఎదో చెప్పబోతే శివాజీ అన్న పేరు వద్దు ఆయన గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. మిగిలిన ఇద్దరిలో విన్నర్ ఎవరో చెప్పు. అని అడ్డు తగిలింది.

నేను ప్రియాంకా విన్నర్ అని అనుకుంటున్నా అని చెప్పింది శోభా. నువ్వు ఎవరనుకుంటున్నావ్ అని ప్రశాంత్ ను అడిగింది. దానికి నేను యావర్ అనుకుంటున్నా అని చెప్పాడు. ఎవిక్షన్ పాస్ విన్నర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ చెప్పడంతో ప్రశాంత్ నిర్ణయం మేరకు యావర్ పేరు చెప్పింది శోభా. యావర్ పేరు చెప్పగానే శివాజీ తెగ సంబరపడ్డాడు. చప్పట్లు కొడుతూ థాంక్స్ శోభా మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని మళ్లీ కెలికాడు. దాంతో శోభ మరోసారి రెచ్చిపోయింది. థ్యాంక్స్ ఎందుకు అన్న.. నియమాల ప్రకారం నిర్ణయం తీసుకోమని అన్నారు కాబట్టి  నేను ప్రశాంత్, నిర్ణయం తీసుకున్నాం. తప్పు చేస్తే శిక్షకు రెడీ అని అంది. దాంతో శివాజీ నువ్ సంచలక్ గా ఉన్న ప్రతిసారి గొడవ జరిగింది అని అరిచాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా.. మీరు అన్నమాటని నేను తీసుకోలేకపోతున్నా అంటూ శివాజీ పై రంకెలేసింది శోభా. దాంతో శివాజీ సారి చెప్పాడు . అయినా శోభా శాంతించలేదు. నేను మాట్లాడింది ఈ గేమ్ గురించి కాదు.. ఈ గేమ్‌లో నేను ఎక్కడ గెలుస్తాను.. ఈ గేమ్ గురించి నాకు తెలియదా.. నీనేమైనా పిచ్చోడ్నా’ అని శివాజీ మాట మార్చేశాడు. ఇంత రచ్చ చేసి ఇప్పుడు ఈ గేమ్ గురించి కాదు అంటూ మస్కా కొట్టే ప్రయత్నం చేశాడు శివాజీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.