-
ఆల్రెడీ ఈ ఏడాది ఆఖరికి వచ్చేసింది. నవంబర్ సెకండాఫ్‌లో అడుగుపెట్టేశాం. ఇయర్ ఎండింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వెకేషన్‌కి ఎక్కడికి వెళ్లాలి? ఈ ఇయర్ కంప్లీట్ చేయాల్సిన టాస్క్ లేంటి? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాల్సిన విషయాలేంటి? న్యూ ఇయర్‌ని ఎలా బిగిన్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు జనాలు. మామూలు జనాలకే అన్నేసి ప్లాన్స్ ఉంటే, స్టార్స్ ప్లానింగ్ ఇంకే రేంజ్లో ఉండాలి?
-
మిగిలిన హీరోల సంగతేమో గానీ, వాల్తేరు బ్రదర్స్ లో మాత్రం ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. 2023 స్టార్టింగ్‌లో కలిసి హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి అండ్ మాస్ మహరాజ్ రవితేజ. వాల్తేరు వీరయ్యలో వీళ్ల సినర్జీకి వావ్ అన్నారు ప్రేక్షకులు. ఉత్తరాంధ్ర యాసలో మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ శ్లాంగ్‌లో మాస్ మహరాజ్ ప్రేక్షకులను మెప్పించారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు గట్టి పోటీ ఇచ్చి, వండర్ఫుల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది వాల్తేరు వీరయ్య.
-
ఈ ఏడాది రవితేజ ఫిల్మోగ్రఫీలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు యాడ్ అయ్యాయి. అయితే అవి సక్సెస్ఫుల్ సినిమాల జాబితాలో క్లీన్ చిట్ తెచ్చుకోలేకపోయాయి. అటు చిరంజీవికి కూడా భోళా శంకర్ చేదు ఫలితాన్నే అందించింది. వాటన్నిటినీ మర్చిపోయి రెట్టింపు ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నారు ఈ సిల్వర్‌స్క్రీన్ బ్రదర్స్.
-
పొంగల్‌కి రిలీజ్ అయ్యే ఈగిల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఓ వైపు, గోపీచంద్ మలినేని కొత్త సినిమాతో మరోవైపు బిజీగా ఉన్నారు రవితేజ. గోపీచంద్ మలినేనితో రవితేజ చేసిన సినిమాలన్నీ మాస్ పల్స్ ని బాగా పట్టుకున్నవే. వారిద్దరి కాంబినేషన్లో క్రాక్ హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమా తర్వాత రెండో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నామని అంటున్నారు గోపీచంద్ మలినేని.
-
ఇటు చిరంజీవి కూడా వశిష్ట సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్‌తో బింబిసార తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకున్నారు వశిష్ట. ఇప్పుడు రెండో సినిమాని మెగాస్టార్‌తో చేస్తున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కాన్సెప్ట్ తో మూవీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ షెడ్యూల్లో యాక్షన్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్. అటు రవితేజ కూడా ఆల్రెడీ యాక్షన్ మోడ్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇయర్ స్టార్టింగ్‌లో పండగ సందడితో మొదలైన వీళ్లిద్దరూ, ఇయర్ ఎండింగ్‌లోనూ సేమ్ ప్లానింగ్‌తో దూసుకుపోతుండటంతో హ్యాపీగా ఫీలవుతున్నారు ఆడియన్స్.