కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన.. ఆ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చింది మాత్రం గీతా గోవిందం సినిమానే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వాటిని సక్సెస్ లుగా మలుచుకుంటూ ఎందో ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతుంది. ఇక పుష్ప సినిమా అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకండా బాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో అటు హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంది. మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో బీటౌన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేసింది . ప్రస్తుతం తను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది.
” నేను ప్రయాణాన్ని చాలా మిస్ అవుతున్నాను. ప్రయాణం చేసే అబ్బాయిల గురించి ఒక చిన్న విషయం. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే ప్రయాణం నిర్ధారించుకోండి. ఎక్కడికైనా, ఇలా .. మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి లేదా కుటుంబంతో లేదా ఒంటరిగా ఎక్కడైనా.. ఏదైనా కానీ ఎక్కడైనా సురక్షితంగా. ఎందుకంటే ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇవే కాకుండా విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలను తెలియజేస్తుంది. ఇది అద్భుతం. మీరందరూ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
ఇక రష్మిక సౌత్ మూవీస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సెకండ్ పార్ట్ ఈ సినిమా. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు.. విజయ్ దేవరకొండతో మళ్లీ జత కట్టనుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో రష్మిక మెయిన్ లీడ్. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే ఈ బ్యూటీ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్. మొత్తానికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.