Most Recent

Prabhas: ప్రభాస్ సినిమాతో పోటీకి సిద్ధమవుతోన్న మరో సినిమా.. డంకీతో పాటు ఆ మూవీ కూడా..?

Prabhas: ప్రభాస్ సినిమాతో పోటీకి సిద్ధమవుతోన్న మరో సినిమా.. డంకీతో పాటు ఆ మూవీ కూడా..?

క్రిస్మస్ సీజన్‌కు ప్రభాస్ ఇచ్చిన షాక్‌తో అన్నీ తప్పుకున్నాయి.. నేనున్నా అంటూ షారుక్ ఖాన్ మాత్రం అలాగే అడ్డంగా నిలబడిపోయారు. దాంతో ఇటు సలార్.. అటు డంకీ మధ్య అసలు పోటీ నడుస్తుందిప్పుడు. కానీ ఈ రెండింటినీ కంగారు పెడుతున్న సినిమా మరోటి ఉంది. అందరూ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. 1000 కోట్ల రేంజ్ ఉన్న మన సినిమాల్నే అంతగా భయపెడుతున్న ఆ సినిమా ఏంటి..?

6 నెలల ముందే క్రిస్మస్ సీజన్ హౌజ్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరిచూపు సలార్‌పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 1పై అంచనాలు మామూలుగా లేవు. దీనికి పోటీగా అదే రోజు షారుక్ ఖాన్ డంకీ కూడా వస్తుంది. సలార్, డంకీ కంటే ఓ రోజు ముందే మరో సినిమా వస్తుంది. అదే ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్‌డమ్. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇండియాలోనూ వేలాది థియేటర్లలో ఆక్వామెన్ దండయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ సినిమాతో మనకు ప్రాబ్లమ్ ఏంటి అనుకోవచ్చు కానీ ఔట్ సైడ్ ఇండియా అంతా ఆక్వామెన్ హవానే కనిపిస్తుంది.

ఆక్వామెన్ రాకతో ఓవర్సీస్‌లో సలార్, డంకీకి భారీ దెబ్బ తప్పదు. పైగా ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఆదరణ పెరిగింది. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇండియా వరకు ఎలాగోలా ప్రభాస్, షారుక్ మేనేజ్ చేసినా.. ఓవర్సీస్‌లో మాత్రం ఆక్వామెన్ ఆధిపత్యం భారీగానే ఉంది. ముఖ్యంగా US, UK లాంటి దేశాల్లో ఈ నీటి వీరుడితో మన హీరోలు యుద్ధం చేయాల్సిందే..!

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.