Most Recent

Bigg Boss 7 Telugu: ఊహించని ఎలిమినేషన్.. సందీప్ మాస్టర్ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న శోభా

Bigg Boss 7 Telugu: ఊహించని ఎలిమినేషన్.. సందీప్ మాస్టర్ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న శోభా

బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తారు. అలాగే ఎలిమినేషన్ అంటూ టెన్షన్ పెడతారు. ఇక ఈ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి ఊహించని విధంగానే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఇక గతవారం కూడా ప్రేక్షకులకు షాక్ ఇచ్చే ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. శనివారం హౌస్ లో ఉన్న వారందరికీ క్లాస్ తీసుకున్న నాగార్జున. ఆదివారం మాత్రం ఆడిస్తూ పాడిస్తూ సందడి చేశారు. ఇక ఎప్పటిలానే చివరిలో సందీప్ ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు. సందీప్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. సందీప్ హౌస్ లో మొదటి హౌస్ మెట్ అయ్యాడు. అలాగే నామినేషన్స్ లో కూడా ఎక్కువ లేడు.

దాంతో ఇప్పుడు ఆయన సడన్ గా ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్నవారు షాక్ కు గురయ్యారు. శోభా అయితే సందీప్ ను వెళ్లొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మాస్టర్‌ని వెళ్లొద్దంటూ కింద కూర్చొని మరీ బతిమలాడింది శోభా. మీరు లేకపోతే నేను ఆడలేను.. హౌస్ లో ఉండలేను అంటూ ఏడ్చేసింది శోభా శెట్టి. అలాగే అమర్ దీప్, ప్రియాంక కూడా ఎమోషనల్ అయ్యారు.

అలాగే వెళ్తూ వెళ్తూ శివాజీని గట్టిగా పొగిడేశాడు. అన్న నువ్వు బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశాడు సందీప్. సందీప్ ఎలిమినేట్ అని ప్రకటించగానే శివాజీ కూడా షాక్ అయ్యాడు. నువ్వు ఎలిమినేట్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు రా.. అని అన్నాడు. ఇక తన నామినేషన్ వల్లే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడని తేజ తెగ ఫీల్ అయ్యాడు. నేను నామినేషన్ చేయడం వల్లే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అన్న.. నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని అనుకున్నా కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అని తేజ ఫీల్ అయ్యాడు. దానికి సందీప్ మాస్టర్ ఇదంతా ఓ ప్రాసెస్ రా.. అలాంటిదేమి లేదు అంటూ దైర్యం చెప్పాడు. సందీప్ మాస్టర్ హౌస్ నుంచి వెళ్లి పోవడంతో అందరికంటే శోభా ఎక్కువగా ఫీల్ అయ్యింది. తాను సేవ్ అయ్యానన్న ఆనందం కంటే సందీప్ ఎలిమినేట్ అయ్యాడని కింద కూర్చొని మరీ ఏడ్చేసింది. ఆయన కాళ్ళ మీద పడి మరీ వెళ్లొద్దు అంటూ బ్రతిమిలాడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.