యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన చిత్రం మ్యాడ్. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి విడుదలైన మ్యాడ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్, రివ్యూలు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన మ్యాడ్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 3 నుంచి మ్యాడ్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘మీకందరికి పిచ్చెక్కించే శుభవార్త. మ్యాడ్ సినిమా నవంబర్ 3 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది’ అంటూ ఈ మూవీ కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్.
కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన మ్యాడ్ సినిమాలో రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆంటోని, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ప్రధానా పాత్రలు పోషించారు. అలాగే జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ కూడా ఓ క్యామియో రోల్‌లో మెరిశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా మ్యాడ్ సినిమాను నిర్మించారు. ఇక ధమాకా, బలగం ఫేమ్ భీమ్స్ సిసిరిలియో అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక మ్యాడ్ సినిమా కథ విషయానికి వస్తే.. మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరతారు. వారి జీవితాల్లోకి జెన్నీ(అనంతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్) ఎంటర్ అవుతారు. మరి ఈ ముగ్గురి వల్ల అశోక్, మనోజ్, డీడీ జీవితాలు ఎలా మారిపోయాయి? అన్నది ఎంతో ఫన్ ఫుల్‌గా తెరకెక్కించారు డైరెక్టర్. మరి థియేటర్లలో మ్యాడ్ సినిమాను మిస్ అయ్యారా? లేక మళ్లీ చూస్తూ కడుపుబ్బా నవ్వాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj
— Netflix India South (@Netflix_INSouth) October 30, 2023
మ్యాడ్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..