
టాలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అదే మార్క్ కొనసాగించిన విజయ్ దేవరకొండకు కొన్ని చిత్రాలు డిజాస్టర్స్ గా అయ్యాయి. అందులో ‘లైగర్’ సినిమా భారీగా నష్టాన్ని చవిచూసింది. ఈ మూవీ పరాజయం తర్వాత దేవరకొండ టైమ్ అయిపోయిందని చాలా మంది అన్నారు. అందుకు తగ్గట్టుగానే ‘లైగర్’ పరాజయం తర్వాత మొదలైన ‘ఖుషి’ సినిమా కూడా ఎన్నో అటంకాలను ఎదుర్కొంది. దీంతో విసుగు వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా కెరీర్ వదిలేసి హోటల్ నడిపే ఆలోచనలో పడ్డాడట! అందుకు కారణాన్ని తెలియజేశారు ఈ హీరో.
బుధవారం ‘ఖుషి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన విజయ్ దేవరకొండ.. ‘ఖుషి’ సినిమాకి ఎదురైన అడ్డంకుల వల్ల విజయవాడ హైవేపై ఇడ్లీ హోటల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నానంటూ అసలు విషయం చెప్పేశారు. అంతేకాదు ఆ హోటల్‌కి సమంత పేరు పెట్టాలని నిర్ణయించుకున్నానని ఫన్నీ కామెంట్స్ చేశారు.
‘ఖుషి’ సినిమా షూటింగ్ సమయంలో సమంత తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ జరగాల్సి ఉండగా సమంత మయోసైటిస్ బారిన పడింది. దాంతో కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయింది. చాలా కాలం గ్యాప్ తర్వాత సమంత కోలుకున్న తర్వాత కూడా ‘ఖుషి’ కాకుండా ఇతర సినిమాల షూటింగ్, ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. దాంతో ‘ఖుషి’ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది.
ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఒక దశ షూటింగ్ పూర్తి చేశాం, రెండో దశ షూటింగ్ చేయబోతున్నాం, సమంత కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా మాకు తెలియదు. కొన్నాళ్లుగా చిత్రీకరణ ప్రారంభం కాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. “ఏదో సినిమా షూటింగ్ జరగడం లేదు, ఖాళీ సమయం ఉంది. విజయవాడ హైవేలో ఓ ఇడ్లీ హోటల్ పెట్టి దానికి సమంత ఇడ్లీ హోటల్ అని పేరు పెడదాం అని డైరెక్టర్‌తో చెప్పాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.