
ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్‌తో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. వాళ్లను గెలికితే.. తేనపట్టును రాయితో కొట్టినట్లే. షారుక్ ఫ్యాన్స్ విషయంలో జరిగిందిదే. పఠాన్ బ్లాక్‌బస్టర్‌తో గాల్లో తేలిపోతున్న వాళ్లకు.. గుండెల్లో కాలిపోయే న్యూస్ చెప్పాడు ఓ దర్శకుడు. దాంతో మంటలు మామూలుగా రావట్లేదు. నువ్ సినిమా తీయ్ మేం చూసుకుంటాం అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ గుండెలు మండే న్యూస్ ఏమై ఉంటుంది..?
చాలా చాలా సంవత్సరాల తర్వాత షారుక్ సంతోషంగా ఉన్నారు.. ఆయన ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఇదంతా పఠాన్ తీసుకొచ్చిందే. పైగా జవాన్‌పై కూడా అంచనాలు మామూలుగా లేవు. క్లిక్ అయితే 1000 కోట్లు వసూలు రావడం పక్కా. ఇక రాజ్‌కుమార్ హిరాణీ డంకీ సెట్స్‌పై ఉంది. ఆయన సినిమా అంటే పక్కా బ్లాక్‌బస్టర్. ఇలా ప్రస్తుతం షారుక్ కెరీర్‌కు తిరుగులేదు.
ఆల్ గుడ్.. అంతా హ్యాపీస్ అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఓ వార్త ఫ్యాన్స్‌ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అదే డాన్ 3 నుంచి షారుక్ ఖాన్‌ను తప్పించడం. కింగ్ ఖాన్‌ను కాదని.. రణ్‌వీర్ సింగ్‌ను డాన్ 3 కోసం ఫర్హాన్ అక్తర్ ఫైనల్ చేసారు. ఈ వార్తనే షారుక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు షారుక్ లేకుండా డాన్ ఏంట్రా బాబూ.. మీ పిచ్చి కాకపోతేనూ అంటూ సోషల్ మీడియాలో తిట్ల దండకం షురూ చేసారు.
అమితాబ్ డాన్‌కి రీమేక్‌గా 2007లో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన డాన్ బ్లాక్‌బస్టర్ అయింది. ఆ కారెక్టర్‌కు షారుక్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. డాన్ 2 కూడా ఓకే అనిపించింది. ఇప్పుడు డాన్ 3లో రణ్‌వీర్ సింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. కాంబో కన్ఫర్మ్ అయినందుకే ట్విట్టర్ షేక్ అయిపోతుంది. రేపు సినిమా వచ్చాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో..? అయినా వాళ్లన్నారని కాదు కానీ.. షారుక్ లేని డాన్ ఫ్రాంచైజీ చూడటం కాస్త కష్టమే.. ఏమంటారు..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.