-
తెలుగు సినీప్రియులకు ఫేవరేట్ హీరోయిన్ సాయి పల్లవి. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాందించుకుంది.
-
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ .. నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
-
గ్లామర్ దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
-
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకున్న వింత అలవాటు గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు విభూది తినే అలవాటు ఉందని తెలిపింది. విభూది తినడం చాలా ఇష్టమట.
-
ఇప్పటికీ తాను ఏదైనా ప్రదేశం వెళ్తే బ్యాగులో విభూది పెట్టుకుని వెళ్తానని.. విభూది తినడం మర్చిపోలేని అలవాటు. మంచి చెట్టు నుంచి తయారు చేసిన విభూది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె తెలిపింది.