Most Recent

Tollywood: మెయిన్ హీరోలుగానే కాదు అతిథులుగాను అలరిస్తున్న మన హీరోలు

Tollywood: మెయిన్ హీరోలుగానే కాదు అతిథులుగాను అలరిస్తున్న మన హీరోలు

అతిథులుగా మారిపోతున్నారు మన హీరోలు. కథలు నచ్చి చిన్న పాత్రలు చేయడానికి కూడా ఓకే అంటున్నారు. భాషతో సంబంధం లేకుండా.. కారెక్టర్ నచ్చితే అందులోకి దూరిపోతున్నారు. స్క్రీన్ స్పేస్ చూడట్లేదు.. హీరోతో పనిలేదు.. ఉన్నంతలో మెప్పించడానికి రెడీ అంటున్నారు స్టార్స్. ఇలా ఈ మధ్య గెస్ట్‌లుగా మారిన హీరోలు చాలా మందే ఉన్నారు. తాజాగా మరో హీరో అతిథిగా మారిపోయాడు.  స్టార్ హీరోలను చిన్న పాత్రల కోసం మెప్పించడం అంటే చిన్న విషయం కాదు.. దానికి చాలా కలిసిరావాలి. ఇగో పక్కనబెట్టి మరో హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి స్టార్ హీరోలు ఒప్పుకోవడం కూడా కష్టమే. కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది.

హ్యాపీగా మరో హీరో సినిమాలో అతిథిగా మారిపోతున్నారు మన హీరోలు. తాజాగా ధనుష్ కోసం నాగార్జున గెస్ట్ అవుతున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. నిజానికి అప్పట్లోనే ధనుష్, నాగ్ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది.. కానీ ఆగిపోయింది. అదిప్పుడు పూర్తయ్యేలా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ రాజా కూడా చిరు బ్రదర్ గా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఆ మధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాలో తళుక్కున మెరిశారు విజయ్ దేవరకొండ.

మరోవైపు రజినీకాంత్ సైతం తన కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న లాల్ సలామ్‌లో అతిథిగా మారిపోయారు. ఓ వైపు జైలర్‌లోనూ నటిస్తూనే.. అక్కడ గెస్ట్‌గా నటించారు రజినీ. ఎవరి వరకో ఎందుకు.. పవన్ కళ్యాణ్‌నే తీసుకోండి. బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో అయినా.. మరో కీలక పాత్రలో నటించారు పవన్. గతంలో గోపాలా గోపాలా సినిమాలోనూ ఇలాంటి పాత్రే చేసారీయన. మరోవైపు వెంకటేష్ కూడా విశ్వక్ సేన్ ఓరి దేవుడాలో దేవుడి పాత్రలో కనిపించారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గన్ కూడా అతిథే. అలాగే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ గా మారనున్నాడని టాలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నాని చిన్నపాటి పాత్ర చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ మధ్య ఇండస్ట్రీలో గెస్టుల లిస్టు పెరిగిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Rajinikanth (@rajinikanth)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.