
సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైమంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంది మృణాల్. దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తెలుగు సినీ ప్రియులు, చిత్రబృందానికి కృతజ్ఞతలు చెప్పారు మృణాల్. సౌత్ అడియన్స్ ను మరింత అలరిస్తానని తెలిపింది.
“డియర్ ఆడియన్స్.. నటిగా నా మొదటి సినిమా సీతారామం. నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు .. ఈ ప్రయాణంలో అంతులేని ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. మరిన్ని సంవత్సరాలు విభిన్నమైన పాత్రలతో మీకు వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశారు మృణాల్. అలాగే చిత్రయూనిట్ ను ఉద్దేశిస్తూ…నా నుంచి సీత బెస్ట్ వెర్షన్ ను స్క్రీన్ పైకి తీసుకువచ్చిన డైరెక్టర్ హను రాఘవపూడికి.. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్ కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.