Most Recent

Pawan Kalyan: మకాం మార్చనున్న జనసేనాని.. ఇక పై అక్కడి నుంచే

Pawan Kalyan: మకాం మార్చనున్న జనసేనాని.. ఇక పై అక్కడి నుంచే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి మకాం మారిపోతుందా..? పార్ట్ టైమ్ సినిమాలు, ఫుల్ టైమ్ ఏపీ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారా..? ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వారాహి విజయయాత్ర తర్వాత మరింతగా ఫోకస్ పెట్టాన పవన్ కళ్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయవాడకు పవన్ షిఫ్ట్ అయ్యారు.. హైద్రాబాద్‌లోని తన నివాసం నుంచి విజయవాడకు మకాం మార్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్ నగరాలకు తరచుగా వెళ్లి వస్తుండే పవన్.. ఇక నుంచి రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టడంతో.. కేవలం సినిమా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మిగతా సమయంలో ఏపీ ప్రజలకు అందు బాటులో ఉండేలా.. ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి విజయవాడలోనే ఉండేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల విడుదలైన బ్రో సినిమా తర్వాత.. పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్ లో ఉంటూ.. ఏపీలో వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పుమనడంతో.. పవన్ కళ్యాణ్ తన నివాసాన్ని మంగళగిరికి మార్చాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని.. అక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం తన భార్యాపిల్లలు, విదేశాల్లో ఉన్నారు. మరోవైపు.. మంగళగిరి పార్టీ కార్యాలయం ప్రాంగణంలోనే 5 అంతస్తుల నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఆ బిల్డింగ్ ను పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ తన ఇంటిని మార్చుకుని.. అక్కడే ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి మకాం మారిపోతుందా..? పార్ట్ టైమ్ సినిమాలు, ఫుల్ టైమ్ ఏపీ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారా..? ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వారాహి విజయయాత్ర తర్వాత మరింతగా ఫోకస్ పెట్టాన పవన్ కళ్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయవాడకు పవన్ షిఫ్ట్ అయ్యారు.. హైద్రాబాద్‌లోని తన నివాసం నుంచి విజయవాడకు మకాం మార్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్ నగరాలకు తరచుగా వెళ్లి వస్తుండే పవన్.. ఇక నుంచి రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టడంతో.. కేవలం సినిమా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మిగతా సమయంలో ఏపీ ప్రజలకు అందు బాటులో ఉండేలా.. ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి విజయవాడలోనే ఉండేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల విడుదలైన బ్రో సినిమా తర్వాత.. పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైద్రాబాద్ లో ఉంటూ.. ఏపీలో వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పుమనడంతో.. పవన్ కళ్యాణ్ తన నివాసాన్ని మంగళగిరికి మార్చాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని.. అక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం తన భార్యాపిల్లలు, విదేశాల్లో ఉన్నారు. మరోవైపు… మంగళగిరి పార్టీ కార్యాలయం ప్రాంగణంలోనే 5 అంతస్తుల నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఆ బిల్డింగ్ ను పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ తన ఇంటిని మార్చుకుని.. అక్కడే ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.