
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. కొద్ది రోజులుగా చంద్రముఖి సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటుంది. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. హారర్ జోనర్‌లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన పోస్టర్ లో కంగనా లుక్ ఆకట్టుకుంటుంది. అందులో బంగారు అభరణాలు, పట్టు వస్త్రాలతో రాజ నర్తకి చంద్రముఖి పాత్రలో కంగనా లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పుడు విడుదలైన పోస్టర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. 2005లో పి.వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది.
ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. అలాగే ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.