
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆగస్ట్ 1న తనకు బాబు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. తన కొడుకు పేరును రివీల్ చేయడమే కాదు.. ఏకంగా అబ్బాయి పిక్ షేర్ చేసింది. “మా ప్రియమైన అబ్బాయి కోవా ఫీనిక్స్ డోలన్ ను పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మటల్లో చెప్పలేము.”అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
తాను తల్లిని కాబోతున్నట్లు గతంలో ఇన్ స్టా వేదికగా అనౌన్స్ చేసింది ఇలియానా. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంది. అయితే ఇలియానా పెళ్లి కాకుండా తల్లి అవుతున్నట్లు ప్రకటించడంతో నెటిజన్స్ షాకయ్యారు. ఆ తర్వాత చాలా రోజులు తనకు కాబోయే భర్త గురించి సస్పెన్స్ మెయింటెన్ చేసిన ఈ బ్యూటీ.. కొద్దిరోజుల క్రితం అతడిని అభిమానులకు పరిచయం చేసింది.
ఇలియానాకు కాబోయే భర్త పేరు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ అని తెలుస్తోంది.. ఈ గోవా బ్యూటీకి బాబు జన్మించడంతో నర్గీస్ ఫక్రీ, కరణ్‌వీర్ శర్మ, అతియా శెట్టి, సోఫీ చౌదరి, హుమా ఖురేషీతో సహా పలువురు ప్రముఖులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఈ బ్యూటీ చివరిసారిగా 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ లో కనిపించింది. ఇటీవలే ఆమె అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ అనే కామెడీ చిత్రంలో నటించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.