

‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’. లవ్ జిహాద్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. మొదట 32 వేల మంది యువతుల కథ ఇది అని చెప్పగా.. ఆతర్వాత అది కేవలం ముగ్గురు అమ్మాయిల కథ అంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ది కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయాలని చాలామంది కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాని తాము ఆపలేమన్నారు. దీంతో మే 5న మలయాళంతో పాటు తమిళ్ తదితర భాషల్లో థియేటర్లలో విడుదలైంది. చాలా చోట్ల ఈ సినిమా ప్రదర్శనలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో రెండో రోజు షోస్ క్యాన్సిల్‌ను కూడా రద్దు చేశారు. మరి రాజకీయ మంటల్లో నలుగుతోన్న ఆదాశర్మ ది కేరళ స్టోరీ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
తొలిరోజు ‘ది కేరళ స్టోరీ ‘ బాక్సాఫీసు వద్ద 8 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు మాత్రం వసూళ్లు గణనీయంగా పెరిగాయి. శనివారం (మే 6) ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు వసూలు చేసింది. మొత్తమ్మీద రెండు రోజుల్లో రూ. 20 కోట్లను కలెక్ట్ చేసిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా తెలిపారు. ది కేరళ స్టోరీ’ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలనే పోషించిన ఆదాశర్మ తొలిసారిగా ఓ డిఫరెంట్ రోల్‌లో నటించింది. సినిమాలో ఆమె పోషించిన షాలిని ఉన్నికృష్ణన్ అలియాస్ ఫాతిమా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..